04-11-2025 12:38:49 AM
నిర్మల్, నవంబర్ ౩ (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి పోచమ్మ విగ్రహ పున ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు కోట్లతో అడెల్లి ఆల యాన్ని నిర్మించగా కొత్త ఆలయంలో పోచ మ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నాలు గు రోజులుగా నిర్వహించనున్నారు.
తొలి రోజు విగ్రహ ఉత్సవాల ఊరేగింపు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా మాజీ దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్వాహకులు లక్కిడి జగన్మోహన్ రెడ్డి పూజారి శర్మ, వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ పూజా రెడ్డి ఆలయ అధికారులు భూమయ్య పాల్గొన్నారు.