07-01-2026 01:20:33 AM
శాసన ండలిలో టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 33 జిల్లాలుంటే, కేవలం ఐదారుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలున్నారని, సీఈవోలు, అదనపు కలెక్టర్లకు జిల్లా పర్యవేక్షణ బాధ్యతలు ఇస్తున్నారని, ఇది విద్యాశాఖ నిబంధనలకు పూర్తి విరుద్దమని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. 70 మంది ఉప విద్యాధికారులు (డిప్యటీఈవోలు) ఉండాల్సి వస్తే అన్ని పోస్టులూ ఖాళీ గానే ఉన్నాయన్నారు. 600 మండలాలకు 13 మంది మాత్రమే ఎంఈవోలున్నారని, దీంతో స్కూల్ ప్రధానోపా ధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు.
మంగళవారం శాసనమం డలిలో స్పెషల్ మెన్షన్స్‌లో భాగంగా పాఠశాల విద్యాశాఖపై ఆయన మాట్లాడారు. స్కూల్‌తో పాటు పర్యవేక్షణ చేయడం హెచ్‌ఎంకు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పది డైట్ కాలేజీల్లో 20 ఏళ్ల్లుగా ఒకే ఒక టీచర్ ఉన్నారని, టీచర్ తయారు చేసే కాలేజీలకే బోధించే అ ధ్యాపకులు లేకపోవడం దురదృష్టకరమన్నా రు. పదోన్నతులు కల్పించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరా రు.
అలాగే రాష్ట్రంలో 1030 గురుకుల పా ఠశాలల్లో 650కిపైగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ప్రభుత్వం 12 ఏళ్ళుగా దాదా పు రూ.3500 కోట్లు అద్దె రూపంలోనే చెల్లించిందని తెలిపారు. ఈ మొత్తంతో గురుకు లాలకు శాశ్వత భవనాలే నిర్మించి ఉం డొచ్చన్నారు. అద్దె భవనాల్లో అరకొర వసతులతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లకు క్వార్టర్లతో కూడిన పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని, గురుకులాల టైంటేబుల్ మార్చాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి దామో దర రాజనర్సింహా సమాధానమిస్తూ... టైం టేబుల్ మార్పుపై కమిటీ వేశామని తెలిపారు.