07-01-2026 01:21:09 AM
మేడిపల్లి, జనవరి 6 (విజయక్రాంతి): నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మేడిపల్లి పోలీసులు మంగళవారం ఉదయం 11 గంటలకు ఉప్పల్ డిపో సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్డుపై ద్విచ క్ర వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ప్రజల భద్రతల దృష్ట్యా, ట్రాఫిక్ ని బంధనలను కచ్చితంగా పాటించాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.