9 May, 2026 | 8:52 PM

కాంగ్రెస్ చేరికల కమిటీ నియామకం

25-04-2024 02:11 AM

l కమిటీలో మహేష్‌కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, కోదండరెడ్డిలకు అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు టీపీసీసీ నాయకత్వం చేరికల కమిటీని నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డికి చేరికల బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులనే చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయించింది.