9 May, 2026 | 7:52 PM

బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోంది

25-04-2024 02:12 AM

l వీ హనుమంతరావు

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆరోపించారు. అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడగడం కాదని, పదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి జై శ్రీరాం అనడం తప్ప ప్రజల పరిస్థితిని పట్టించుకోవాలనే ఆలోచనే లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అయితే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.