బక్రీద్ పండుగ శాంతియుతంగా నిర్వహించాలి
09-05-2026 08:25 PM
– సీఐ రవీందర్ సూచనలు
కోనరావుపేట,(విజయక్రాంతి): రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో మండలంలోని ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ రవీందర్ పాల్గొని పండుగను శాంతియుత వాతావరణంలో, పరస్పర సహకారంతో నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరుపుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






