భూములకు నష్టపరిహారం చెల్లింపుల్లో కుంభకోణం

25-04-2024 02:10:49 AM

ఏసీబీ డీఎస్పీ సోదాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జిల్లాలోని రేపల్లెవాడ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన భూముల నష్టపరిహారం చెల్లింపులో పెద్ద ఎత్తున కుం భకోణం జరిగినట్లుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదుల అందడంతో బుధవారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సోదాలు నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలోని భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకొని సంబంధిత అధి కారులను విచారించారు. గతంలో ఆర్డీఓగా విధులు నిర్వహించిన సిడం దత్తు, డీటీ నాగోరావు, ఎంసీ భరత్‌లను ప్రాథమికంగా విచారించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 

చెల్లింపులపై ఆరోపణలు..

భూముల సేకరణలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు ఆరోపణలు న్నాయి. అనర్హులకు పెద్ద మొత్తంలో డబ్బు లు చెల్లించినట్లు అర్హులైన భూ నిర్వాసితులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నా యి. ఏసీబీ అధికారుల సోదాలతో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి గుబులు మొదలైంది.