02-11-2025 06:13:32 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం పండించిన రైతుకు మద్దతు ధర కల్పించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం సోను మండలంలోని పాకు పట్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.