calender_icon.png 8 December, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆర్ద్రా మహోత్సవం

07-12-2025 06:34:03 PM

కొండపాక (విజయక్రాంతి): బ్రాహ్మీ ముహూర్త ఆర్ద్రాభిషేకంలో కలెక్టర్ హైమవతి పాల్గొని కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం ఆర్ద్రా మహోత్సవం నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్గశిర మాసంలో వచ్చిన ఆర్ద్రా నక్షత్రం కావడం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 4 గంటలకే గణపతి పూజ నిర్వహించి సంతాన మల్లికార్జున స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు.

అభిషేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొని స్వయంగా సంతాన మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వస్తి వాచనం అనంతరం నవగ్రహ, దిక్పాలక, రుద్ర కలశ స్థాపన చేసి సంతాన పాశుపత అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు. అనంతరం సంతాన పాశుపత హవనం, పూర్ణాహుతి జరిగాయి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.