07-12-2025 06:45:46 PM
పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్..
పాపన్నపేట (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కోరారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, పొడిచన్ పల్లి తండా, నాగసాన్ పల్లి, శేరిపల్లి, కొడపాక, గాజులగూడెం, ఎనికేపల్లి, బాచారం, రాజ్యా తండా, అర్కెల్, నార్సింగ్, సీతానగరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు. అనంతరం బాచారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులైన వెంకట్ తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఆయన వెంట మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, భూమయ్య తదితరులు ఉన్నారు.