28 April, 2026 | 3:07 AM

సింగరేణిలో ఉద్యోగాలు ఖతం?

28-04-2026 01:26 AM

ఉద్యోగాలు ఊడగొట్టేందుకు ప్యాకేజీలు?

సింగరేణిలో కొత్త ఉద్యాగాలు రావు... ఉన్న ఉద్యోగాలకు గ్యారం టీ లేదు... అంటే కార్మికులను నుంచి ఔననే సమాధానమే వస్తుంది. కార్మికుల భయాందోళనకు సింగరేణిలో యాజమాన్యం అనుసరి స్తోన్న విధానాలే అందుకు అద్దం పడుతున్నాయి... సింగరేణిలో రోజు రోజుకు పరిస్థితు లు విషమంగా మారుతున్నాయి. నిరుద్యోగం తాండవిస్తోంది... కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న కార్మిక ద్యోగాలు ఊడిపోతాయనే భయం కార్మికులను పట్టి పీడీస్తున్నది... గత పదేళ్లకుపైగా ఒక్క భూగర్భ గని రాలేదు. కొత్త గా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు... సింగరేణిలో ఉద్యోగ నియామకాల ఊసేలేదు... ఉన్న ఉద్యోగులు కాస్త పదవీ విరమణతో తగ్గుము ఖం పట్టాయి. 

మౌన దీక్షలో కార్మిక సంఘాలు..

  1. కొత్త ఉద్యోగాలు రావు.. కొత్త గనులు లేవు..
  2. కార్మికుల సంఖ్య తగ్గింపునకు కసరత్తు
  3. కాలం తీరిన మెడికల్ బోర్డు...

బెల్లంపల్లి, ఏప్రిల్ 27: సింగరేణిలో వారస త్వ ఉద్యోగాల పురుద్దరణకు అతిగతి లేకుండా పోయింది.  టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం పుణ్యమాని 2005లో వారసత్వ ఉద్యోగాలు శాశ్వతంగా రద్దయ్యాయి. ఇక అప్పటినుంచి సింగరేణిలో ఉద్యోగాలకు శకం ముగిసిపోయింది. 2014 ఎన్నికల ముందు అంటే తెలం గాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో కేసీఆర్ సింగరేణిలో కార్మికులకు ఇచ్చిన అనేక హామీల్లో వారసత్వ  ఉద్యోగాల అంశం ఒకటి.

ఈ హామీనీ కేసీఆర్ చెప్పిన ప్రకారం అమలు చేయలేదు. కార్మికులను మోసం చేశారు. కేసీఆర్ మాటల్ని నమ్మి టీఆర్‌ఎస్ ను ప్రజలు గెలిపించారు. పదేళ్లుగా సాగినా పాలనలో సింగరేణిలో కేసీఆర్ ఒక్క గని తేలేదు. ఓపెన్ కాస్టులను ఆపలేదు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించనూ లేదు. కార్మికలోకం ముం దు కేసీఆర్ ప్రభుత్వం నగ్నంగా అభాసుపాలయ్యారు. కారుణ్య నియామకాలను అమల్లోకి తెచ్చి ఇవే వారసత్వ ఉద్యోగాలుగా కార్మికులను బురిడీ కొట్టించి నమ్మించారు. 

కార్మికుల జీవితాలతో చెలగాటం

నిజానికి కారుణ్యం వేరు... వారసత్వ ఉద్యోగాలు వేరు... వాటిమధ్య  చాలా తేడా ఉంది. మృతి చెందడం, అనారోగ్య కార్మికుల స్థానంలో ఆన్‌ఫిట్ అయ్యిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేవే కారుణ్యం ఉద్యోగాలు. రాను రాను అవికూడా సింగరేణిలో అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. మెడికల్ బోర్డును అప్రకటితంగా నిలిపివేసి కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. ఈ క్రమంలో వందలాది మంది సింగరేణి కార్మికులు తీవ్రంగా నష్టపోయారు.

ఇదిలా ఉంటే మరోవైపు నాగాల పేరిట  కార్మికులను కంపెనీ డిస్మిస్ చేయడం, ఇలా అనేక వైపులా కార్మికుల జీవితాలతో కంపెనీ చెలగాటం ఆడుతున్నది. కార్మికుల వారసులు ఉద్యోగాలు కోల్పోయి నష్టపోయారు. కార్మికుల రిక్రూట్ ను నిలువరించేందుకే, యాజమాన్యం మెడికల్ బోర్డును స్తంభింపచేయడంలో అం తర్యం  స్పష్టంగా కనిపిస్తోంది. సింగరేణిలో 32 వేలకు మిగిలిన కార్మికులను మరింతగా తగ్గించాలనే వ్యూహానికి కార్మికుల పిల్లల భవిష్యత్తును బలిచేస్తున్నారన్న ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతు న్నాయి. 20 వేలకు కార్మికులను కుదించాలనే మాస్టర్ ప్లాన్ సింగరేణి కంపెనీ పాలసీగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కారుణ్యం లేదు.

కనీసం నడువలేని పరిస్థితిలో ఉన్న కార్మికులను కూడా ఫిట్ చేసి పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య భారిన పడ్డ కార్మికులు వందలాదిగా ఉన్నారు. వారి గోడు అరణ్యరోధనగా మారింది. ఇది సరిపోనట్టు కార్మికుల గొంతు కోసేందుకు యాజమాన్యం మరో కుట్రను తెరపైకి తీసుకొచ్చింది..

ఈ పన్నాగంతో కారుణ్య ఉద్యోగాలకు అడ్డుకట్టవేస్తున్నది. అన్ ఫిట్ చేసి కార్మికులకు కొంత  నగదు ప్యాకేజీ ఇచ్చి ఉద్యోగాల భరతం పట్టనున్నదనీ తెలుస్తోంది. అందుకుగాను ఉద్యోగాలకు బదులు ఒకే మొత్తంగా రూ. 35 లక్షలు ఇచ్చేసి సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు చరమగీతం పాడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే గాలకు ద్వారాలు పూర్తిగా మూసుకుపోతాయి. యాజమాన్యం ఈ విధానాన్నే  అంతిమంగా పెట్టుకుని ఉద్యోగ అవకాశాలను మెల్లమెల్లగా మృగ్యం చేసుకుంటూ వస్తున్నది.

-మెడికల్ బోర్డుతోనే ఖతం..

ఉద్యోగాలను నియంత్రించే ఉద్దేశ్యంతో ఇప్పటివరకూ మెడికల్ బోర్డును ఆపివేసిన  యాజమాన్యం వ్యూహం మార్చనున్నది. ఉద్యోగాలను పూర్తిగా తమ లక్ష్యం  నెరవేర్చడం కోసం మెడికల్ బోర్డు సింగరేణి చేతిలో ప్రధాన ఆయుధం కానున్నది. అన్ ఫిట్ చేసి కార్మికులకు నగదు ప్యాకేజీలతో  సింగరేణి నుంచి సాగనంపుతారు. యాజమాన్యం అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగిస్తది. దానికి అడ్డుచెప్పే వారే లేరు. సింగరేణిలో ఇంత పెద్ద ఎత్తునా విద్వంసం జరుగుతుంటే..? కార్మిక సంఘాలు కిమ్మనకుండా ఉండిపోవడమే తమ వంతైంది. కార్మికులను కసాయి కి అప్పగించినట్టు.. చేతులెత్తేసి చోద్యం చూస్తున్నాయి. ఈ మౌనం కంపెనీ కార్యం తీర్చడానికేనని విశ్లేషకులు అంటున్నారు. 

కంపెనీ దూకుడు...

సింగరేణిలో కంపెనీ దూకుడు పెంచింది.. న్యాయం ధర్మం లేకుండా పోయింది. కార్మికులకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలంటే అధి కారులు ఒక్కప్పుడు భయపడేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. భయం అనేది తలకిందులయ్యింది. ప్రస్తుతం కార్మికులే భయప డుతున్నారు. సింగరేణిలో ఉద్యమాలు సన్నిగిల్లిపోయాయి. కార్మికుల పక్షాన పోరాటం చేసే విప్లవ కార్మిక సంఘాలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది.

సింగరేణిలో పోరాడే సంఘాలు లేవు. ఉన్న సంఘాలు, వాటి లీడర్లు కంపెనీ ఇచ్చే గిఫ్టులకు కక్కుర్తిపడి ఆత్మహత్య సదృశ్యం జీవితం గడుపుతున్నారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితి కంపెనీకి పూర్తి అనుకూలంగా మారింది. దీంతో ఒక ప్రణాళిక ప్రకారం యాజమాన్యం సింగరేణి కార్మికుల మనుగడను  దెబ్బతీస్తూ వస్తున్నది. ఇక  యువకుల ముందున్నది ఉద్యోగ సాధన హక్కుల ఉద్యమాలే.