28 April, 2026 | 3:05 AM

గొంతు తడపని మిషన్ భగీరథ

28-04-2026 01:23 AM
  1. లీకేజీ అవుతున్న పైప్‌లైన్
  2. కరువైన మరమ్మత్తులు

ఉట్నూర్, ఏప్రిల్ 2౭ (విజయక్రాంతి): జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. గొంతు తడుపుకునేందుకు సుదూరాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ  అవస్థలు పడుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా తాగునీరు సరఫరా అయ్యేవిధంగా  అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజనం కోరుతుంది. ప్రజల గొంతు తడిపేందుకు  గత బారాస ప్రభుత్వం తీసుకువచ్చిన  మిషన్ భగీరథ  పైపులు తరచు లీకేజీ కావడంతోపాటు  గ్రామాలకు సక్రమంగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మరమ్మత్తులకు వచ్చిన పైపులను  మిషన్ భగీరథ అధికారులు మరమ్మత్తులు చేయడంలో పూర్తిగా విప్లమయ్యారని  గిరిజనుల ఆరోపిస్తున్నారు.

తాగునీటి కోసం వేకువజామునే..

ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, ఆదిలాబాద్ గ్రామీణ మండలం, సిరికొండ తదితర మం డలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి కోసం  వేకువజామునే  తాగునీటి సౌకర్యం ఉన్న స్థలాలకు  పరుగులు తీస్తున్నారు. ఆది లాబాద్ గ్రామీణ మండలంలోని  కండల పంచాయతీ పరిధిలోని  పోతా గూడా, రాజు గూడా  తదితర గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వేకువజాముననే  బోర్ బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు.

రాజుగుడాలోని  40 కొలం గిరిజన కుటుంబాలకు ఉన్న ఒకే ఒక బోరుబా వి వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ బోరుబావి వద్ద గంటపాటు  కొడితే ఒక బిందెడు నీరు వస్తుందని, ఎలాగో ప్రతి కుటుంబంలోని సభ్యులు  గొంతు తడుపుకునే విధంగా  నాలు గు గంటలకు లేచి  బోరుబావు వద్దకు చేరుకుంటున్నారని  గ్రామ పటేల్ సీడం బాపూరా వు తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలోని  సమాకా పంచాయతీ పరిధిలోని  పాట గూడ, రాము గూడా, మారుతి గుడా గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం పరుగులు తీస్తు న్నారు. ఈ గ్రామాలకు కిలోమీటర్ దూరంలోని  వ్యవసాయ భూమి లో తవ్విన  బావి వద్దకు పరుగులు తీస్తున్నారు. రాము గుడా కు చెందిన  గిరిజనులు పాత బావిలోని నీటిని  తాగుతున్నారు.

వ్యవసాయ భావి,తాగునీటి బావిలో  తాగునీరు ఆకుపచ్చగా మారిన  ఆ నీటినే తాగుతూ గొంతు తడుపుకుంటున్నారు.. ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని  మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు సైతం  తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీ టి కోసం పడుతున్న కష్టాలను  అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన  పట్టించుకోవడంలేదని  గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు  తగిన చర్యలు తీసుకొని  మరమ్మత్తు చేయడంతో పాటు తాగునీరు అందించాలని  గిరిజనులు కోరుతున్నారు.. తాగునీటి సమస్యపై  గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులను  ‘విజయక్రాంతి’ వివరణ కోరుటకు  సంప్రదించగా.. వారి సెల్ ఫోన్లు పనిచేయడం లేదని జవాబు వస్తుంది.