11-11-2025 12:00:00 AM
వేములవాడ టౌన్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాజన్న ఆలయంలో భక్తులకు అందించాల్సిన మొక్కులు, సేవలు, దర్శనాల విషయంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ విమర్శించారు. సోమవారం స్థానిక పద్మశాలీ సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.భక్తులు ముందుగానే మొక్కులు పెట్టుకుని వస్తున్నా, టికెట్లు సరిపోవడం లేదని, జాగాలు అందుబాటులో లేవని చెప్పి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇది రాజన్న భక్తుల మనోభావాలను లెక్కచేయకపోవడమని మండిపడ్డారు.ఇటీవల పత్రికల్లో, న్యూస్ ఛానెళ్లలో వచ్చిన కథనాలపై ఆలయ ఈఓ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.దేవాలయ ప్రతిష్టను కాపాడాల్సిన అధికారులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని,భక్తుల్లో అయోమయం పెరు గుతుందని ప్రశ్నించారు.ముఖ్యంగా కార్తీకమాసం సందర్భంగా కల్యాణ మొక్కులు, కోడె మొ క్కులు, లింగార్చన మొక్కులు పెట్టుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని గుర్తుచేశారు.
వారికి సరిపడా వసతులు, టికెట్ల వ్యవస్థ, క్రమబద్ధమైన దర్శనాల ఏర్పాట్లు దేవస్థానం తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్ చేశారు.అభివృద్ధికి మేము అడ్డంకి కాదు. కానీ అభివృద్ధి పేరుతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదు. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలపై అధికారులు బహిరంగంగా వివరణ ఇవ్వాలని శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేగుల రాజకుమార్ వివేక్ రెడ్డి నామాల శేఖర్ రేగుల శ్రీకాంత్ అన్నం నరసయ్య డాక్టర్ వెంకన్న సగ్గు రాహుల్ మామిండ్ల లక్ష్మీరాజ్యం బిల్లా కృష్ణ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.