calender_icon.png 11 November, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న నీటి పారుదల వివరాల గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

11-11-2025 12:00:00 AM

 కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

జనగామ, నవంబర్ 10 (విజయక్రాంతి):చిన్న నీటిపారుదల గణాంక వివరాల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లోని కాన్ఫెరెన్స్ హల్ లో ఏడవ చిన్న నీటి పారుదల గణాంక నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో చిన్న నీటి పారుదల కింద వచ్చే సహజ, మానవ నిర్మిత బోరుబావులు చెరువులు, కుంటలు, కాలువలు తదితర వివరాలన్నింటిని పకడ్బందీగా సేకరించాలని అన్నారు.

ఈ సర్వే నిర్వహణ కొరకు గ్రా మీణ స్థాయిలో జిపిఓలు, ఫీల్ అసిస్టెంట్లు, ఏఈఓ లు, పంచాయతీ కార్యదర్శులను ఎన్యుమరేటర్లుగా నియమించాలని అన్నారు. వివరాల నమోదుకు సంబంధించి నిర్దేశించిన అప్లికేషన్ గు రించి సర్వే అధికారులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించాలని వివరించారు. చిన్న నీటిపారుదల వివరాలన్నింటినీ ఖచ్చితత్వంతో నమోదు చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్,జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి చిన కోట్యా నాయక్ , వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.