11-11-2025 12:00:00 AM
---జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు,నవంబరు10(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలె క్టర్ దివాకర టి.ఎస్ అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు రెవె న్యూ సి హెచ్ మహేందర్ జి,స్థానిక సంస్థలు సంపత్ రావు,ఆర్డీవో వెంకటేష్ లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.
మొత్తం 61దరఖాస్తులు వచ్చాయి.భూ సమస్యలు 07,గృహ నిర్మాణ శాఖకు 11, పెన్షన్ 10,ఉ పాధి కల్పనకు 03,ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 30దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారు లకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధి కారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ త్రాగునీటి సమస్య లు, సీజనల్ వ్యాధులు, పారిశు ద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.