18 March, 2026 | 3:04 AM

డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా!

18-03-2026 01:38 AM
  1. కేసీఆర్, కేటీఆర్ రావాలి, సీఎంను నేను తీసుకొస్తా
  2. బీ-ఫామ్ ఇచ్చిన వారందరిని టెస్టుకు తీసుకురావాలి
  3. ఫామ్ హౌస్‌లో పట్టుబడింది మీ నాయకులే కాదా
  4. ఎంత పెద్దలున్నా వదిలేదే లేదు
  5. శాసనమండలిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): డ్రగ్స్ టెస్ట్‌కు కాంగ్రెస్ సిద్ధం, బీఆర్ ఎస్ నేతలు సిద్ధమా అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. సీఎంను తాను తీసుకొస్తానని, డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ కూడా రావాలని, బీఆర్‌ఎస్, కాం గ్రెస్ సభ్యులందరూ డ్రగ్స్ టెస్టు చేసుకుని ప్రజలకు మంచి సందేశమిద్దామని పేర్కొన్నారు. ఫామ్ హౌస్‌లో పట్టుబడింది మీ నాయకులే కాదా? అని ప్రశ్నించారు.

చట్టం అందరికీ సమానమేనని, ఎంత పెద్ద వ్యక్తులున్నా వారిని వదిలేది లేదన్నారు. మంగళ వారం గవర్నర్ ప్రసంగానికి శాసనమండలి లో ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్ పార్టీ గురించి మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ యువనాయకుడు కేటీఆర్ కూడా డ్రగ్స్ టెస్టుకు ముందుకు రావాలని ఛాలెం జ్ విసిరారు. రాష్ట్రంలో చాక్లెట్లు, బిస్కెట్లలా గంజాయి, కొకైన్ దొరుకుతుందని, తెలంగాణను డ్రగ్స్ వ్యాపారంలా మార్చారని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్  పార్టీ ఎవరెవరికి బీ-ఫామ్ ఇచ్చిందో వారందరిని డ్రగ్స్ టెస్టుకు తీసుకువస్తానని, అలాగే బీఆర్‌ఎస్ కూడా తీసుకు రావాలన్నారు. డ్రగ్స్ పేరు ఎత్తగానే మీ నాయకుడి పేరు బయటకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గతంలో టెస్టులకు రాకుండా భయపడ్డది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజలరు తమ పిల్లలు ఈ మాదక ద్రవ్యాల నుంచి కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పదేళ్లు విచ్చలవిడిగా సరఫా అయిందని, ఇదంతా తాను వివరాలతో చెబుతున్నానన్నారు.

మాజీ ఎమ్మెల్యేలు డ్రగ్ తీసుకుని పట్టుబడితే ఇప్పటి వరకు ఆయనపై బీఆర్‌ఎస్ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా డ్రగ్స్ తీసుకుంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అని నిలదీశారు. మత్తుపదార్థాలతో అంధకారాన్ని చేసిన ఈ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి డ్రగ్స్‌ను అరికడుతున్నారన్నారు.

మూసీ సుందరీకరణ చేస్తుంటే, గాం ధీ విగ్రహం పెడుతుంటే లేని ది ఉన్నట్లుగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, గత పదే ళ్లలో బీఆర్‌ఎస్ ఏం చేయలేదని ఆయన విమర్శించారు. మూసీ మూ సీలా ఉంటే రా ష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని తె లిపారు. కొందరు సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ క్షణికానందం పొందుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము వంద సీట్లలో గెలిచి ఇదే సభలోకి మళ్లీ వస్తామని ఆయన సవాల్ విసిరారు.