పట్టపగలే చోరీ.. 8 లక్షలు స్వాహా!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఘటన
జహీరాబాద్, మార్చి 17: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మంగళవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో ఒక రైతుకు సంబంధించిన 8 లక్షల రూపాయలను గుర్తు లేని వ్యక్తులు దోచుకెళ్లారు. జహీరాబాద్ మండలం తుంకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి భూమి రిజిస్ట్రేషన్ కోసం జహీరాబాద్‌లోని ఓ బ్యాంకులో రూ.7 లక్షలు డ్రా చేశారు.
దాంతోపాటు ఆయన దగ్గర ఉన్న మరో రూ.లక్ష నగదు బ్యాగులో పెట్టుకొని మంగళవారం రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ తన స్కూటీలో నగదు పెట్టి రిజిస్ట్రేషన్ కోసం లోనికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూస్తే స్కూటీ తాళాలు తీసి ఉండటం గమనించారు. అందులో నుంచి డబ్బులు చోరీకి గురయ్యాయని నర్సింహారెడ్డి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు




