అరి వీర భయంకర ప్రారంభం
యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియో స్, శ్రీకర్ మూవీ మేకర్స్ బ్యానర్లపై శేషుబాబు సీహెచ్, కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరి వీర భయంకర’. ఈ చిత్రానికి కిషన్‌ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్సాఖాన్, వైదిక, ఐశ్వర్య, కనిక మోంగ్యా, అర్చనా రాయ్, డెబొర, అమితశ్రీ, శ్రుతిరాజ్, సోమదత్త, నాగ మహేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిని మా శుక్రవారం హైదరాబాద్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సంద ర్భంగా చిత్ర దర్శకుడు కిషన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నేను ఈవీవీ దగ్గర, కోడి రామకృష్ణ దగ్గర వర్క్ చేశాను. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చాలా అనుభవం ఉంది. టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్స్‌తో వర్క్ చేశాను.
సూర్యవంశ్ మూ వీకి అమితాబ్‌తో పనిచేయడం మర్చిపోలేను. మా ప్రొడ్యూసర్స్ కథ కూడా వినకుండా నా టాలెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను చేసేందుక ఒప్పుకోవటం చాలా హ్యాపీగా ఫీలయ్యా ను. ఇదొక అల్టిమేట్ డిఫరెంట్ లవ్‌స్టోరీ. దేవుడు ఎప్పుడు పుట్టాడో ప్రేమ అప్పుడే పుట్టింది. దైవం ప్రేమ ఒక్కటే. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తూ మూవీ సాగుతుంది. ఈతరంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారనేది ఇందులో చూపిస్తున్నాం. యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ప్రొడ్యూసర్స్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మే దర్శకుడిని నేను. ఒక మంచి హిట్ సినిమా చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా ను. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
‘రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నిర్మాత శేషుబాబు తెలిపారు. మరో నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో 25 ఏళ్ల అనుభ వం ఉన్న డైరెక్టర్ కిషన్ ప్రసాద్‌తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది’ అని తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లతో పాటు నటుడు నాగ మహేశ్, డైలాగ్ రైటర్ పోలూరు ఘటికాచలం కార్యక్రమంలో పాల్గొన్నారు.






