30 June, 2026 | 6:19 PM

సెమీస్‌లో కోకో గాఫ్

05-06-2024 01:01 AM

పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికా టెన్ని స్ స్టార్ కోకో గాఫ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గాఫ్ 4 6 6 తో ఓన్స్ జాబుర్ (ట్యునిషియా)ను చిత్తు చేసింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్ తొలి సెట్‌ను జాబుర్‌కు కోల్పోయింది. అయినప్పటికీ ఫుంజుకున్న గాఫ్ వరుసగా రెండు సెట్లను గెలవడంతో పాటు మ్యా చ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ లో ఇగా స్వియాటెక్ (పోలాండ్) సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో స్వియాటెక్ 6 6 మార్కెటా ఓండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై సునాయాస విజయా న్ని నమోదు చేసుకుంది. గంట వ్యవధిలోనే ముగిసిన మ్యాచ్‌లో స్వియాటెక్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన నంబర్‌వన్ ఆటతో ఓండ్రుసోవాను ముప్పతిప్పలు పెట్టింది. మ్యాచ్‌లో స్వియాటెక్ 5 బ్రేక్ పాయింట్లు, 25 విన్నర్లు సంధించింది. పురుషుల క్వార్టర్స్‌లో సిన్నెర్ 6 6 7 (7/3)తో దిమిత్రోవ్‌పై నెగ్గాడు.