పోలీసులను చితగ్గొట్టిన సైనికులు
30-05-2024 12:21 AM
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఘటన
న్యూఢిల్లీ, మే 29: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సైనికుల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ప్రత్యేక పోలీస్ విభాగానికి చెందిన రయీస్‌ఖాన్, ఇంతియాజ్ మాలిక్, సలీమ్ ముస్తాక్, జహూర్ అహ్మద్ మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కొందరు సైనికులు స్టేషన్‌లోకి ప్రవేశించి పోలీసులతో గొడవకు దిగారు. నలుగురు పోలీసులను చితకబాదారు. దీంతో తీవ్రగాయాలైన పోలీసులను దవాఖానలో చేర్పించారు. ఈ గొడవకు ప్రధాన కారణం తెలియలేదు. ఓ జవాన్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయటమే కారణంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది.






