రేపు భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ!
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఎయిర్‌పోర్టులో దిగగానే అరెస్టుకు సిట్ సిద్ధం
బెంగళూరు, మే 29: సెక్స్ వీడియోలు, మహిళలపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రేపు ఇండియాకు రానున్నట్టు సమాచారం. మే 31వ తేదీన భారత్ వచ్చేందుకు జర్మనీలోని మ్యునిచ్‌లో విమానం టికెట్లు బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్ర యానికి రానున్న నేపథ్యంలో ఆయనను వెంటనే అరెస్టు చేసేందు కు కర్ణాటక సిట్ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్ తరఫు న్యాయవాది అరుణ్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని కోర్టు కొట్టేసింది.
తాత ఆదేశాలతో..
సెక్స్ వీడియోల కేసులో అరెస్టు భయతో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయిన విషయం తెలిసిందే. అక్కడి ఆయనను రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసుల ముందు లొంగిపోవాలని మాజీ ప్రధాని దేవెగౌడ ఆదేశాల మేరకు ప్రజ్వల్ ఇండియాకు రానున్నట్టు సమాచా రం. ఇక, ఇదే కేసులో తనను అరెస్టు చేస్తారన్న భయంతో ప్రజ్వల్ తల్లి భవానీ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.






