బద్దెనపల్లిలో మేకలు–గొర్రెల అంగడి ప్రారంభం
తంగళ్ళపల్లి,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో సర్పంచ్ సిలివేరి లావణ్య చిరంజీవి ఆధ్వర్యంలో మేకలు, గొర్రెల అంగడిని ప్రారంభించారు. మంచి రోజు కావడంతో గురువారం అంగడిని ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఈ అంగడి నిర్వహించబడుతుందని చెప్పారు.
మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అంగడిని సద్వినియోగం చేసుకోవాలని, మేలురకం మేకలు మరియు గొర్రెలు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య, సిలివేరి నర్సయ్య, వార్డు సభ్యులు కొల్లాపూరి నరేష్, గుగ్గిళ్ల సంజువు, వరలక్ష్మి, శ్రీనివాస్, బాలలక్ష్మి, కనకరాజు, ఆవునూరి వెంకటరాములు, కొక్కిరాల ఆగం రావు, సూర్యారావు, నక్క భాస్కర్, అంజయ్య, శ్రవణ్, దేవయ్య, కొమురయ్యతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




