calender_icon.png 15 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటర్ డ్యాం ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా ఆరోహన్ వార్షికోత్సవం

15-11-2025 12:00:00 AM

ఘట్ కేసర్, నవంబర్ 14 (విజయక్రాంతి) : రూటర్ డ్యాం ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరోహన్ వార్షికోత్సవ వేడుకలు  వైభవంగా నిర్వహించారు. శుక్రవారం బాలల దినోత్సవం కూడా కావడంతో చిన్నారుల ఆట పాటలు, సంగీత నృత్య ప్రదర్శనలు, పురాణ పౌరాణిక నాటకాలతో పాటు దేశభక్తిని నింపే ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి.

ఈ హరో హర వార్షికోత్సవానికి పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ అరోహర వార్షికోత్సవానికి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోటర్ డ్యాం స్కూల్ యజమాన్యం ఏ కార్యక్రమాన్ని నిర్వహించిన పిల్లలలో ఉన్న ప్రత్యేక సామర్ధ్యాలను సృజనాత్మకతను వెలికి తీసే విధంగా వినూత్న రీతిలో ఏర్పాట్లు చేస్తారని పలువురు తల్లిదండ్రులు కొనియాడారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడమే మా ధ్యేయమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి పిల్లల్లో  సేవదృక్పథం, దేశభక్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజువల్ ఆరట్స్ ట్రైనర్ గీత భాస్కర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోస్ పాల్  మేరో, పాఠశాల చైర్మన్ మందడి విజయసింహారెడ్డి, డైరెక్టర్ జి. శ్వేతారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు కె. రూపారెడ్డి పాల్గొన్నారు.