14-11-2025 11:46:28 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామం పరిధిలో గల మణిగండ్ల గుట్టపైన నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన కోసం శుక్రవారం స్థలాన్ని చదును చేసే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి మాట్లాడుతూ... భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం త్వరలో శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల పూర్తయినట్లయితే ఈ ప్రాంతంలోని ఎంతోమంది పేదలకు నాణ్యమైన సాంకేతికమైన ఉన్నతమైన విద్యను అందించే అవకాశం ఉంటుందన్నారు.