17 April, 2026 | 10:06 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు

26-03-2025 01:42 AM

సభా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

హుజూర్‌నగర్, మార్చి 25:  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఉగాది పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణి కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.మంగళవారం హుజర్ నగర్ పట్టణంలో ముఖ్యమంత్రి  సభా ఏర్పాట్లను జిల్లా ఎస్పి నరసింహతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ సభ జరిగే  ప్రాంగణం పరిశీలిస్తూ హెలిప్యాడ్ దిగే వద్ద విద్యుత్ స్టంబాలు తొలగించి ఆ లైన్ లో  ఉన్నా విద్యుత్ సరఫరాను వేరే రూట్ లో సరఫరా చేయాలని,హెలిప్యాడ్ నుండి సభా వేదిక వరకు ఆప్రోచ్ రోడ్డును వేయాలని,బారికేడ్లు నిర్మించాలని తెలిపారు. విఐపి, అధికారుల పార్కింగ్ లను పరిశీలించారు. హెలిప్యాడ్ ను, ఆప్రోచ్ రోడ్లు 27 వ తారీఖు సాయంత్రం లోపు పూర్తి చేయాలని తెలిపారు.

ప్రజలు ఎక్కువ గా వచ్చే అవకాశం ఉన్నందున్ట ట్రాఫిక్ సమస్య లేకుండా పలు చోట్ల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలాలకి వెళ్లే రోడ్లలో గుంటలు పూడ్చి,రోలింగ్ ద్వారా చదును చేయాలని దారి పొడువు నా ఏమైనా చెట్ల కొమ్మలు ఉంటే తొలగించాలని,  ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి పార్కింగ్ లో రెండు దారులు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి సూచించారు.

అనంతరం హుజూర్ నగర్ ఆర్డీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, తహసీల్దార్లు నాగార్జున రెడ్డి, కమలాకర్, మంగా, జ్యోతి, కవిత, సైదులు, సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.