28 July, 2026 | 1:46 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ముమ్మరంగా ఏర్పాట్లు

30-05-2024 01:04 AM

పరేడ్ గ్రౌండ్‌లో ౨౦ వేల మందికి సౌకర్యాలు

ట్యాంక్‌బండ్‌పై అద్భుత కళా ప్రదర్శనలు.. 80 స్టాళ్లు 

అధికారిక గేయం జయ జయహే తెలంగాణపై మార్చ్‌ఫాస్ట్ 

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (విజయక్రాంతి): తెలం గాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాన కార్యక్రమాలు నిర్వహించే పరేడ్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్‌పై యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ పదేండ్ల సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చటంతో అందుకు తగ్గట్టుగానే అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

జూన్ 2న ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరులు స్థూపానికి నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ వేడుకలకు వెళ్తారు. ఈ కార్యక్రమానికి సు మారు ౨౦వేలమంది హాజరవుతారని భావిస్తున్నారు. వీరికోసం భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. తాగునీటి సౌకర్యం, టాయిలెట్లను  ఏర్పాటు చేస్తున్నారు. సమాచారం పౌర సం బంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ తెరలు, కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాట్లు చేశారు.

ట్యాంక్‌బండ్ ముస్తాబు

రాష్ట్రావిర్భావం రోజు ట్యాంక్‌బండ్‌పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్ నిర్వహించనున్నారు. పటాసులు, లేజర్ షో, ఫుడ్ గేమింగ్ స్టాళ్లును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎంతోపాటు ప్రముఖలంతా హాజరవుతారు. దీంతో వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో అట్టహాసంగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణపై జాతీయ జెండాల మార్చ్‌ఫాస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై సుమారు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

వీటిల్లో రాష్ట్రంలోని హస్త కళలు, స్వయం సహాయక బృందాల తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల స్టాళ్లు ఉంటాయి. చిన్నారుల కోసం గేమింగ్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లును మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్‌ఎండీఏ జాయింట్, మెట్రో పాలిటన్ కమిషనర్ అమ్రపాలి, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులు బుధవారం సమీక్షించారు. పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు.