14 August, 2026 | 2:58 AM

వినాయక చవితికి ఏర్పాట్లు చేయాలి

14-08-2026 12:27 AM

జోనల్ కమిషనర్ సత్యనారాయణ

మలక్‌పేట్, ఆగస్టు 13  (విజయక్రాంతి): రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తేలేత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో అవరమైన  ఏర్పాట్లు చేయాలనీ నగర ట్రాఫిక్ డిసిపి -3 రాహుల్ హెగ్డే, జీహెచ్యంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ కన్నం సత్యనారాయణలు అధికారులను ఆదేశించారు.

రానున్న వినాయక చవితి -2026 ఉత్సవాలను పురస్కరించుకొని నర్కిపూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయంలో గురువారం ఉదయం ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, జోనల్ కమిషనర్ సత్యనారాయణల ఆధ్వర్యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతి నిధులు , పలు విభాగాల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. జోనల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఉత్సవ సమితి సభ్యులు ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా డీసీపీ రాహుల్ హెగ్డే, జోనల్ కమిషనర్ సత్యనారాయణలు మాట్లాడుతూ... సమావేశంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై అన్ని ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడతామన్నారు.

వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇటీవల పలు ప్రధాన మార్గలో రోడ్ల పైకి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించమన్నారు. రోడ్లు, విధి దీపాలు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు.  ఉత్సవాలకు తమ పరిధిలో ప్రత్యేక గణేష్ యాక్షన్ టీం బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నీ భాగాల అధికారులు సమన్వయంతో  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గణేష్ శోభ యాత్రలు కొనసాగే ప్రధాన రోడ్లలో  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటమని వారు తెలిపారు.