14 August, 2026 | 2:56 AM

బొంతకుంట వాగును సర్వే చేయించిన హైడ్రా అధికారులు

14-08-2026 12:25 AM

ఘట్ కేసర్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ బొంతకుంట వాగు పై చెక్ డ్యామ్ ఎగువ భాగంలో ఓబడా రియల్ ఎస్టేట్ సంస్థ మట్టి తో వాగును కబ్జా చేయడంపై వచ్చిన ఫిర్యాదులతో  హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికా రులు గురువారం పరిశీలించి సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నం బర్లు 153, 154 పరిధిలో వాగు అసలు వె డల్పు, బఫర్ జోన్ సరిహద్దులను గుర్తించేందుకు సర్వే నిర్వహించడం జరిగింది.

మరోసారి సర్వే నిర్వహించడం జరుగుతుందని, సర్వే నిర్వహించిన అనంతరం ఆక్ర మణలు జరిగినట్లు తేలితే సంబంధిత నిర్మాణదారులకు లేదా ఆక్రమణదారులకు నోటీ సులు జారీ చేస్తామని అధికారులు తెలిపా రు. ఈ కార్యక్రమంలో హైడ్రా సిఐ రాజశేఖ ర్, డిఈ వెంకటయ్య, ఇరిగేషన్ ఏఈ మౌ నిక, సర్వేయర్ రూప, స్థానిక కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మెట్టు గణేష్ యాదవ్, సహదేవ్,  బిజెపి నాయకులు పి. పాండురాజ్ తదితరులు పాల్గొన్నారు.