10 May, 2026 | 9:31 AM

ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

15-09-2025 07:41 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): సెప్టెంబర్ 17న వనపర్తి జిల్లాలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఐ.డి. ఒ.సి ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చీఫ్ విప్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాపాలన వేడుకల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.