15-09-2025 07:39:44 PM
మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం కాళ్లకల్ పట్టణంలో అనిల్ యాదవ్, దుర్గేష్ యాదవ్ మహ్మద్ అబిద్ అన్సారీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ ఫోమ్ వాషింగ్ సెంటర్ ను వివిధ పార్టీ నాయకులతో కలిసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ యవత తల్లిదండ్రులు మీద ప్రభుత్వాల మీద ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడే విధంగా ఇలాంటి పనులను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురం మహేష్, నత్తి బాలరాజు, కాంగ్రెస్ నాయకులు వీరబోయిన గోపాల్, ఎల్ శ్రీనివాస్ గౌడ్, తుమ్మల రాజు యాదవ్, డిఎన్. రాజు, కనిగిరి రవి కుమార్, రవీందర్ రెడ్డి, మహేష్ యాదవ్, సిమెంట్ నవీన్, విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.