calender_icon.png 14 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాపూర్ తరలించేందుకు వెంటనే ఏర్పాటు చేయాలి

14-05-2025 01:39:41 AM

సింగరేణి సీఎండీతో మంత్రి శ్రీధర్ బాబు 

మంథని మే13 (విజయక్రాంతి) రాజాపూర్ గ్రామాన్ని తరలించేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని, మదనాపూర్ ఓపెన్ కస్తుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సింగరేణి సి అండ్ ఎండితో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సచివాలయంలో  రాజాపూర్ గ్రామ ప్రజలు  సింగరేణి ఓసిపి తో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నమని అవేదన తో మంత్రి శ్రీధర్ బాబు కు  మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ తో పాటు రాజపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లల కొమురయ్య, గ్రామస్తులు విన్నవించారు.

వెంటనే స్పందించిన మంత్రి సింగరేణి సిఎం అండ్ ఎండి బలరామ్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడి  రాజపూర్ గ్రామానికి తరలించే ఫైల్ రెడీ చెయ్యమని ఆదేశించారు. సింగరేణి ఆర్జీ-3 ఓసిపి-2 ఉపరితల గనీ వలన రాజాపూర్ గ్రామానికి జరుగుతున్న తీవ్రమైన అనర్థాలను మంత్రి వివరించారు. 

ఉపరితల గని గ్రామానికి కేవలం 200 మీటర్ల దూరంలో గ్రామానికి అతి చేరువలో ఉన్నందున గనిలో నిర్వహిస్తున్న భారీ పేలుళ్ల తో ఇండ్లపై పెద్ద పెద్ద రాళ్లు వచ్చి పడడంతో పాటు గ్రామంలో ఇండ్లు బీటలు వారుతున్నాయని, బ్లాస్టింగ్ మూలంగా వెలువడిన దుమ్ము దూళి నేరుగా వచ్చి గ్రామంలో చేరుతున్నదన  గ్రామ ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యల పాలవుతున్నారని,సింగరేణి బ్లాస్టింగ్ మూలంగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడితే దానిని భూకంపంగా చిత్రీకరిస్తూ జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదికలను సింగరేణి అధికారులు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్  అవి సింగరేణి బ్లాస్టింగ్ వల్లనే ఇండ్లకు పగుళ్లు ఏర్పడినవని నిర్ధారించారన్నారు. గ్రామ ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఇండ్లను తనాఖా పెట్టి లోన్లు తీసుకుందామని బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళితే మీది సింగరేణి ప్రభావిత గ్రామమని దానికి మేము ఎలాంటి లోన్లు మంజూరు చేసేది లేదన్నారని, 

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సింగరేణి సంస్థ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ గ్రామ ప్రజల ఇబ్బందులను సమస్యలను పట్టించుకొని రాజపూర్ గ్రామాన్ని పూర్తిస్థాయి నిర్వాసిత గ్రామంగా ప్రకటించి పునర్నివాసం కల్పించి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో గ్రామస్తులు పాల్గొన్నారు.