calender_icon.png 14 May, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అండగా రేవంత్ సర్కార్

14-05-2025 01:39:18 AM

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ  చైర్మన్ నాగేశ్వరరావు

జగిత్యాల అర్బన్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు అన్నారు.

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో రూ. 13 కోట్ల 38 లక్షలతో నిర్మించనున్న  20వేల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జగిత్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతమని ఇక్కడ గోదాంల నిర్మాణం అత్యంత ఆవశ్యకమన్నారు. ఏడాది కాలంలో గోదాంను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్లకు రు.500 బోనస్ ఇస్తూ రేషన్ కార్డు పై బీద మధ్య తరగతి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మక మన్నారు. 

లక్ష్మి పూర్ గ్రామంలో సీడ్ ప్రాసెస్ యూనిట్ నిర్మాణం పూర్తి అయిందని, కొంత యంత్ర సామగ్రి కొరత ఉందని దానిని పూర్తి చేయాలని కార్పొరేషన్ చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల డిఈ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, సదాశివ రావు, గడ్డం నారాయణ రెడ్డి, చెరుకు జాన్, అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు.