22 April, 2026 | 1:49 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర

22-04-2026 12:39 PM

ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు హర్షణీయం

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) నివేదికపై హైకోర్టు తీర్పు హర్షణీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా.. కాంగ్రెస్ కక్షపూరిత విధానాలు మార్చుకోవాలని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై నిందలు వేసి.. కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరానికి రెండున్నరేళ్ల మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. గత్యంతరం లేక ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కేసీఆర్, హరీశ్ రావులతో పాటు స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీకి ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు వెల్లడించింది.