17 March, 2026 | 4:37 AM

దాడి చేసి డబ్బులు, సెల్ ఫోన్ లాక్కున్న వ్యక్తుల అరెస్ట్

17-03-2026 12:50 AM

కొత్తపల్లి, మార్చి 16(విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషనులో  ఆసిఫా బాద్ జిల్లా కు చెందినరమిల్లా కృష్ణమూర్తిపిర్యాదు చేయడం జరిగింది. కరీంనగర్ రూ రల్ పోలీసుల కథనం ప్రకారం అట్టి ఫిర్యాదులో పిర్యాదుదారు పేర్కొన్నదేమనగా, కొ న్ని రోజుల క్రితం తన మొబైల్ ఫోన్లో గ్రిం డర్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో జాయి న్,యాప్ ద్వారా కొంతమంది గేలు మరి యు ట్రాన్స్జెండర్ వ్యక్తులతో పరిచయం ఏ ర్పడిన తరువాత,తాను హోమోసెక్సువల్ అలవాటు కలిగి ఉన్నట్టు మెసేజ్ ద్వారా తెలిపాడు. దీంతో కొంతమంది

తన మొబైల్ నెంబర్ ఇవ్వగా, కొంతమంది ఫోన్ చేయగా కలుసుకుని హోమోసెక్స్ చేసిన తరువాత వారు కొంత నగదు ఇచ్చి పంపించేవారని తెలిపాడు. అదేవిధంగా 13వ తేది ఉదయం, జుమైర్ అనే వ్యక్తి నుండి ఫోన్ చేసి తనతో హోమోసెక్స్ చేయాలని మరియు మసాజ్ చేయాలని చెప్పి దానికి డబ్బులు ఇస్తానని చెప్పగా దానికి ఫిర్యాదుదారు అంగీకరించి కరీంనగర్ చేరుకుని ఆ వ్యక్తికి ఫోన్ చేయగా, ఆ వ్యక్తి బ్లూ మోటార్ సైక్పి వచ్చి, బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ఉన్న నటరాజ్ ఫంక్షన్ హా ల్ వెనుక భాగంలో కూలిపోయిన గోడల వద్ద ఉన్న చెట్ల పొదల దగ్గరకు తీసుకెళ్లాడు.

అక్కడ హోమోసెక్స్ చేయమని చెప్పగానే ,అంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అతనిపై చేతులతో దాడి చేసి, ఈ పని చేసి ఎంత డబ్బు సంపాదించావు అని ప్ర శ్నిస్తూ తన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ ఇవ్వకపోతే అక్కడికక్కడే చంపేస్తామని బెదిరించారు.దాంతో భయపడి ఫిర్యా దుదారు తన దగ్గర ఉన్న రూ.1,500/- నగ దు ఇచ్చాడు. అనంతరం అతని మొబైల్ ఫోన్ ఇవ్వమని అడగగా, దీంతో భయపడి ఇచ్చేశాడు.

డబ్బులు లేకపోవడంతో ఫిర్యాదుదారు బస్ స్టాండ్లో రాత్రి నిద్రపోయి, మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు సమర్పించాడు.ఈ ఫిర్యాదు మేరకు సీఐ ఏ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసుకొని, ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ ఎ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా 16వ తేదీ ఉదయం నిందితు లు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్లారు.

అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.నిందితులలో ఒక మైనర్ బాలుడు , ఎ-1 సయ్యద్ అబ్బాస్ @ ఆర్బాస్, నివాసం సలేహనగర్ రేకుర్తి, ప్రస్తుతం కిసాన్ నగర్, కరీంనగర్, ఎ-2 మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ నివాసం కిసాన్ నగర్ కరీంనగర్, ప్రస్తుతం సిటిజన్ కాలనీ , బొమ్మకల్ వారి వద్ద నుండి ఫిర్యాదుదారుని మొబైల్ ఫోన్ మరియు రూ. 1,500 నగదు, అలాగే మూడు మొబైల్ ఫో న్లు మరియు నేరానికి ఉపయోగించిన రెం డు బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను అదుపు లోకి తీసుకుని కోర్టులో రిమాండ్ కొరకు పంపించడం జరిగిందని తెలిపారు.ఈ కేసు ను త్వరితగతిన ఛేదించినందుకు కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌష్ ఆలం మరియు ఏసీపీ విజయ్ కుమార్ సీఐ నిరంజన్ రెడ్డి ని మరి యు వారి బృందాన్ని అభినందించారు. అ నంతరం ఏసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ యువకులు వారి మొబైలు ఫోన్ ల లో గ్రిండర్ అప్ గాని ఏ ఇతర సెక్సుయల్ కి సంబందించిన అప్ లు గాని డౌన్లోడ్ చేసుకొని మోసపోవద్దని ,మొబైలు ఫోన్ లను అ తి జాగ్రత్తగా వాడుకోవాలని అటువంటి అప్ లు డౌన్లోడ్ చేసి అందులోనివి ఇతరుల కు పంపినచో చట్ట రీత్యా నేరమని, అటు వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.