17 March, 2026 | 2:08 AM

కార్యకర్తలను నిర్మాణం చేసిన పార్టీ బీజేపీ

17-03-2026 12:48 AM
  1. ఈనాడు అధికారానికి పునాది కార్యకర్తలే
  2. అలాంటి కార్యకర్తలను అవమాణించడం అర్వింద్‌కు తగదు

జగిత్యాల, మార్చి 16 ( విజయక్రాంతి ) :కార్యకర్తలను నిర్మాణం చేసిన పార్టీ బిజెపి అని, అలాంటి కార్యకర్తలను విస్మరించడం, అణచివేసే ప్రయత్నం ఎంపీ అర్వింద్ కు తగదని బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ము దుగంటి రవీందర్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేక రుల సమావేశం లో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అర్వింద్ కు ఆదర్శం తన తండ్రి అని, అలాంటి వ్యక్తికీ కార్యకర్తలు ఆదర్శం ఎట్లా అవుతారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో అన్నీ పదవులు అనుభవించి, పార్టీ ఓడిపోగానే బిఆర్‌ఎస్ లో చేరిన చరిత్ర మీ నాన్నదనే విషయాన్ని అర్వింద్ మర్చిపోవద్దన్నారు.అవకాశాల కోసం అన్ని ఇచ్చిన పార్టీ ని మారిన మీ నాన్న ను, మిమ్మల్ని చూసి బిజెపి కార్యకర్తలు నేర్చుకోవాల అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సిద్ధాంతం కోసం ప్రాణత్యాగాలు చేసిన రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ మాకూ ఆదర్శం అన్నారు.

రెండు సార్లు మీ నాన్న ధర్మపురి శ్రీనివాస్ ని ఓడగొట్టరనే ఈర్ష్యతోనే మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మి నారాయణను పక్కన పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అర్వింద్ వచ్చాక పార్టీ నిర్మాణం జరగలేదని, 1999,2005 లోనే మున్సిపల్ చైర్మన్ లను గెలిచి, ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ ను గెలిపించిన చరిత్ర బిజెపి ది అని అర్వింద్ గుర్తుంచుకోవాలన్నారు.మెట్ పెల్లి, రాయికల్ లో మెజార్టీ స్థానాలు బిజెపి గెలిస్తే ఎందుకు పార్టీకి చైర్మన్ పీఠం దక్కేలా ప్రయత్నం చెయ్యలేదో పార్టీకి, క్యాడర్ కు, ప్రజలకు అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

2020 మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల లో అంకుల్ ఆనందం కోసం మున్సిపల్ ను బిజెపి వశం కాకుండా తాకట్టు పెట్టిన విషయం ఎంపీ అర్వింద్ గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. నిజాయితీ గురించి, సిద్ధాంతం గురించి మాట్లాడే నైతికత అర్వింద్ కు లేదని, ఆయన డిక్టేటర్ లా ఫీల్ అవడం సబబు కాదన్నారు. నా గురించి, నా ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడే స్థాయి అర్వింద్ కు లేదని గమనించలన్నారు.

నేను ఎన్నికల్లో పోటీ చేసిన సమ యంలో ఓట్లు రాలేదని ఎంపీ విమర్శించ డం విడ్డురం అని, ఆ ఎన్నికల్లో ఒక్క రాజాసింగ్ మినహా ఎవరు గెలవలేదని గుర్తుంచు కోవాలన్నారు. కోరుట్ల లో బిజెపి కీ ఓటు బ్యాంకు ఉందని అక్కడ పోటీ చేసి, ఎందుకు ఓడిపోయావ్ అనే విషయం పై సమాధానం చెప్పి, తర్వాత నా గురించి మాట్లాడాలని రవీందర్ రెడ్డి హెచ్చరించారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ప్రత్యేక పరిస్థితి తో పాటు పార్టీ గ్రాఫ్, మోదీ చరిష్మా తప్ప నువ్వు చేసింది ఏమి లేదని గ్రహించాలని సూచించారు.

రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్ రావు గారిని విమర్శిస్తావా? ఆయన చరిత్ర నీకూ తెలుసా, స్థాయి తెలుసుకోకుండా మాట్లా డ్డం అహంకార పూరిత ధోరణికి నిదర్శనం అన్నారు. పార్టీకోసం పని చేసి ఎంపీగా నీ గెలుపులో కీలకపత్ర పోషించిన మమ్మల్ని అణగాదొక్కే ప్రయత్నం చెయ్యడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరం కలిసి పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.

మన మౌనం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. తాము పార్టీలోనే ఉన్నామని, ఉంటామని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్ రావు నాయకత్వం లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశం లో బిజెపి సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, లింగంపెట శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, చీటీ శ్రీనివాస్ రావు, ఆంకర్ సుధాకర్, లింగ రెడ్డి, తకుర్ కిషోర్ సింగ్, గోగికర్ మహేందర్, గొడిషెల నాగరాజు, బుర్ర ప్రమోద్, కూర్మచలం సతీష్, బిట్టు తదితరులు పాల్గొన్నారు.