calender_icon.png 6 December, 2024 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్

10-10-2024 05:52:57 PM

1100 గ్రాముల గంజాయి, బైక్, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని మాదారం సమీపంలో గల ఈస్ గాం గ్రామానికి చెందిన కొంతమంది గంజాయి విక్రయిస్తున్న సమాచారంతో ఎస్సై సౌజన్య మహేష్ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారి వివరాలను తాండూరు సిఐ కుమారస్వామి వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో షేక్ హసమ్ (తాండూర్), గొల్లపల్లి సందీప్ (తంగళ్ళపల్లి), బండారి శ్యామ్ (తాండూర్), విజయ్ హల్దార్ (ఈస్ గాం) , రాజ్ కుమార్ సర్కార్ (ఈస్ గాం) లు ఉన్నారు. వీరి వద్ద నుండి 1100 గ్రాముల గంజాయి తో పాటు, ఒక బైక్, 4 సెల్ ఫోన్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ సూచించారు. వ్యసనాలకు బానిసలై బంగారు భవితను నాశనం చేసుకోవద్దన్నారు. సంఘ విద్రోహక చర్యలపై, చట్ట విరుద్ధ మైన కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.