13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనుసంధానంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ లో భాగంగా యాదగిరిగుట్ట కే యం గ్రాండ్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 23 గ్రామాల సర్పంచులు, 12 వార్డు సభ్యులు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి అధికారులు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరంయాదగిరిగుట్ట మున్సిపాలిటీ గ్రామాల పరిధిలో ఈనెల 13 నుండి 18 వరకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది .సీసీ కెమెరాలు రోడ్, సేఫ్టీ విధానాల యొక్క ప్రాముఖ, డ్రంక్ అండ్ డ్రైవ్, మాదకద్రవ్యాలు గంజాయి వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్,వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, టౌన్ సిఐ భాస్కర్ ట్రాఫిక్ సిఐ కృష్ణ, ఎస్సై యాదయ్య, సురేందర్ పాల్గొన్నారు.




