07-02-2026 01:00:00 AM
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి):- నియోజకవర్గ పరిధిలో సీవరేజ్ సమస్యలను చాలా వరకు పరిష్కరించినట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్ర వారం మోండా మార్కెట్ మెయిన్ రోడ్ పై 3.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు.
తాను వచ్చిన తర్వాత అవసరమైన ప్రాంతాలలో నూతన సీవరేజ్ లైన్ ల ఏర్పాటుతో పాటు, పైప్ లైన్ సామర్థ్యం పెంచాలాల్సిన ప్రాం తాలలో పునరుద్ధరణ పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడ రోడ్లపై డ్రైనేజీ లీకేజీలు ఉండొద్దనే లక్ష్యంతో పని చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్ దీపికా, బోయిన్ పల్లి సర్కిల్ డాకు నాయక్, వాటర్ వరక్స్ ఆశిష్, డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, తలసాని శివ యా దవ్, రాములు, ఓదెల సత్యనారాయ ణ, ప్రమోద్, మహేందర్, మధు తదిత రులు ఉన్నారు.