27 April, 2026 | 1:32 AM

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఆరూరి శ్రీను

27-04-2026 12:19 AM

చిట్యాల, ఏప్రిల్ 26 : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన ఆరూరి శ్రీను ఎంపికైనట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుండి 25 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో ఆయన ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తనని ఎంపిక చేసిన రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు..