27 April, 2026 | 1:49 AM

మీ టైం పూర్తయింది.. మా టైం మొదలైంది

27-04-2026 12:17 AM

ఎక్స్ వేదికగా టీఆర్‌ఎస్ కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్‌ఎస్) గా తమ పార్టీని ప్రకటించిన మరుసటి రోజే తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ కు దారితీసేలా టీఆర్‌ఎస్ అధినాయకురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ‘మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

శనివారం మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన సభలో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా ప్రకటించిన కవిత, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయంగా టీఆర్‌ఎస్‌ను నిలబెట్టే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తాజాగా ట్విట్టర్‌లో టైం అంటూ పోస్టు చేయ డం ఆసక్తికరంగా మారింది..