6 August, 2026 | 2:09 AM

ఢిల్లీలో హైటెన్షన్... బీజేపీ కేంద్రకార్యలయం వద్ద 'ఆప్' నిరసన

19-05-2024 01:09 PM

న్యూఢిల్లీ: భారతీయ కేంద్ర కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన చేపట్టింది. ఆప్ నేతలపై వేధింపులను వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆప్ నిరసనకారులను నిర్భంధించారు. డీడీయూ మార్గ్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. డీఎంఆర్ సీ ఐటీవో మెట్రోస్టేషన్ తాత్కాలికంగా మూసివేసింది. నిరసనల నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేతలు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుండి కాసేపటి క్రితమే బయలుదేరారు. ‘మేము(ఆప్) పెద్దగా ఎదగకుండా, వారికి సవాల్‌గా మారకుండా ఉండేందుకు’ బీజేపీ ‘ఆపరేషన్ జాదూ’ ప్రారంభించిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు అన్నారు.