16 July, 2026 | 7:59 AM

రష్యాలో రాజకీయ శరణార్థిగా

09-12-2024 02:12 AM

తిరుగుబాటుదారులు డమాస్కస్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌కు రష్యా ప్రభుత్వం రాజకీయ శరణార్థిగా ఆశ్రయం ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అతడు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై.. అధ్యక్షుడు మరణించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అదంతా ఉత్తదేనని రుజువైంది. ‘మానవతా కోణం’లో రష్యా అధికారులు సిరియా అధ్యక్షుడి కుటుంబానికి రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పించారు.