16 July, 2026 | 8:16 AM

ఎవరీ జోలానీ?

09-12-2024 02:15 AM

అధ్యక్షుడు అసద్ దేశాన్ని వీడడంతో ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ మిలిటెన్సీ గ్రూప్ హయత్ తహరీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) అధినేత అబూ మహమ్మద్ అల్ పేరు వెలుగులోకి వచ్చింది. తిరుగుబాటుకు జోలానీ నాయకత్వం వహించడంతో మిడిల్ ఈస్ట్‌లో అతని గురించే చర్చ జరుగుతోంది. 1982లో  ఒక సంపన్న కుటుంబంలో జోలానీ జన్మించాడు. అల్ నుస్రా ఫ్రంట్‌ను స్థాపించాడు. ఈ క్రమంలో 2006లో అరెస్ట్ కాబడి అయిదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

ఆ తరువాత ఇరాక్‌లోని అల్‌ఖైదాలో చేరాడు. కానీ అక్కడ కొన్ని విధానాలు నచ్చకపోవడంతో తిరిగి సిరియాకు వచ్చాడు. ఈక్రమంలో 2016లో అల్‌ఖైదాతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాడు.  తన సంస్థ పేరును  హయత్ తహరీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) గా మార్చాడు. అయితే దీనిని ప్రభుత్వం తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ క్రమంలో 2017లో హెచ్‌టీఎస్ మొదటిసారి ఇతర తీవ్రవాద సంస్థలతో కలిసి సిరియాలో ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అధికారాన్ని పొందారు. అయితే మైనార్టీలను క్రూరంగా అణిచివేస్తారనే పేరు జోలానీపై ఉండేది. కాలక్రమంలో జోలానీలో మార్పు వచ్చింది. తన పాలనలో మైనార్టీలకు ఎలాంటి హానీ జరగదని హామీ ఇచ్చాడు.