calender_icon.png 28 July, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా..

28-07-2025 12:55:12 AM

హాస్యనటుడిగా, కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా సత్తా చాడుతున్నారు సునీల్. ఇప్పుడు మరో విభిన్న పాత్రతో మెప్పించనున్నా రాయ. ప్రభాస్ నిమ్మల తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్ శివ’. అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్లపై నర్సింహ, ఉన్నం రమేశ్ నిర్మిస్తున్నారు.

మణికంఠ, ఐరా బన్సాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సంపత్ నంది చేతుల మీదుగా టీమ్ విడుదల చేయించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.