16 May, 2026 | 2:49 AM

అభాగ్యులకు అండగా ఆశ్రమాలు

16-05-2026 01:41 AM
  1. సుల్తానాబాద్ లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వృద్ధాశ్రమం...
  2. క్యాడర్ దివ్యాంగుల పాఠశాల బాల సదనం... 

సుల్తానాబాద్, మే 15 (విజయక్రాంతి): ముందు వెనక ఎవరు దిక్కులేని అనాధలకు, అదేవిధంగా వయస్సు మీద పడి వృద్ధ వయసులో ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకు, తమ వైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలలో గల పెరిగిద్ద ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రభుత్వ భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి, ప్రభుత్వ వృద్ధాశ్రమం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో 30 పడకలతో ఎంతో చక్కగా నిర్మించారు,

ఇక్కడ ఉండే వృద్ధుల కు ఆరోగ్య రీత్యా ప్రతిరోజు యోగ చేయించడంతోపాటు ఒక మాస్టర్ ఉంటారు, అలాగే ఒక ఏఎన్‌ఎం, కో ఆర్డినేటర్ ను ప్రభుత్వం నియమించింది, మహిళ లకు 15 పడకలు, పురుషులకు 15 పడకలు వేర్వేరుగా నిర్మించడం జరిగింది, అందులో మంచాలతోపాటు వారికి సంబంధించిన ఏదైనా సామాన్ ఉన్నచో భద్రపరచడానికి లాకర్లు ఏర్పాటు చేశారు, అలాగే అటాచ్డ్ బాత్రూంలు ఉన్నాయి, ఇతరత్రా ఏర్పాట్లన్నీ ఎంతో చక్కగా ఉన్నాయి,

అలాగే దీని పక్కనే క్యాడర్ దివ్యాంగుల పాఠశాల భవనం నిర్మాణం జరిగి ప్రారంభానికి సిద్ధంగా ఉంది, ఈ పాఠశాలలో 50 మందికి డే స్కాలర్ అవకాశం ఉంది , ఈ పాఠశాల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతుందని, 70% ప్రభుత్వం, 30% డొనేషన్ల ద్వారా కొనసాగుతుంది, అలాగే బాల సదనం (చిల్డ్రన్ హోమ్) భవనాన్ని ఎంతో చక్కగా నిర్మించారు, ఈ భవనంలో ప్రస్తుతం 50 మంది విద్యార్థులు ఇందులో ఉన్నారు, ఇందులో ఒక సూపర్డెంటుతో పాటు, ఐదుగురు సిబ్బంది ఉంటారు, ప్రతిరోజు రెండు గంటల పాటు స్టడీ అవర్ ఉంటుంది, నూతనంగా నిర్మించిన ఈ మూడు భవనాలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.