22-12-2025 03:50:39 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): టిప్పర్ డికోట్టడం తో అక్కడికక్కడే ఏఎస్ఐ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అన్నోజిగూడ కు చెందిన జగ్గాని రఘుపతి యాదవ్ (59) ఖైరతాబాద్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ గా పనిచేస్తున్నాడు. సోమవారం తన విధులు ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఉప్పల్ టు వరంగల్ హైవే నారపల్లి మసీదు దగ్గర వెనుక నుండి వచ్చిన టిప్పర్ డీ ఢీకొట్టడం తో బైక్ పై నుండి లారీ క్రింద పడడంతో అతని తల మీద నుండి టైర్ పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.టిప్పర్ ను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.