calender_icon.png 22 December, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఐఆర్‌పై విరుచుకుపడ్డ మమత

22-12-2025 03:42:39 PM

బీజేపీ భారీ కుట్ర..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) సోమవారం ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎస్ఐఆర్ లో ఘోరమైన లోపాలు జరిగాయని ఆరోపించారు. నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఎంసీ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పరిశీలకులను నియమిస్తోందని, బీజేపీ ప్రయోజనాలను పెంపొందించడానికి పనిచేస్తోందని ఆరోపించారు. "ఎన్నికల సంఘం కేవలం బీజేపీ ఆదేశాల ప్రకారమే పనిచేస్తోంది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం (Special Intensive Revision) సందర్భంగా ఓటర్ల జాబితా తయారీలో తీవ్రమైన లోపాలు జరిగాయి." అని మమత ద్వజమెత్తారు. 

ఎస్ఐఆర్ విచారణల కోసం మైక్రో అబ్జర్వర్‌లుగా నియమించబడిన కేంద్ర అధికారులకు స్థానిక భాషపై తక్కువ అవగాహన ఉందని, కొనసాగుతున్న సవరణ ప్రక్రియ రెండవ దశలో ధృవీకరణలను నిర్వహించడానికి వారు అనర్హులని తేల్చిచెప్పారు. ఓట్ల జాబితా సవరణ పేరుతో బీజేపీ భారీ కుట్ర చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది బీఎల్ఓలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మమత ఫైర్ అయ్యారు.