calender_icon.png 22 December, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

22-12-2025 04:38:49 PM

హైదరాబాద్: సంక్రాంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 13 నుండి 15వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని(kite festival) నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జనవరి 13 నుండి జరగనున్న పతంగుల పండుగ ఏర్పాట్లను ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఉత్సాహభరితమైన సంస్కృతిని, పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సంబంధిత మంత్రులు కూడా జనవరి మొదటి వారంలో ఏర్పాట్లను సమీక్షిస్తారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నగర శివార్లలో హాట్ ఎయిర్ బెలూన్ ఉత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు.