22-12-2025 03:21:39 PM
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు(Commissioner Sudheer Babu) విడుదల చేశారు. ఎన్ బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండ ను తీర్చిదిద్దామని సీపీ వెల్లడించారు. ఈ ఏడాది 21,056 కేసులు(78 శాతం) పరిష్కారించామన్నారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3,734 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ వెల్లడించారు. ఈ ఏడాది 12 కేసుల్లో 20 ఏళ్ల జైలుశిక్ష పడేలా ఆధారాలు సేకరించామని తెలిపారు. అడ్డగూడూరు హత్య కేసు దర్యాప్తు ద్వారా 17 మందికి జీవితఖైదు పడిందన్నారు.
డ్రగ్స్ రవాణాలో రూ. 20 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను(Drugs) స్వాధీనం చేసుకుని ఒక పెద్ద ముందడుగు వేశారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు సంబంధించి 668 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇది మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లపై చర్యలను తీవ్రతరం చేయడాన్ని ప్రతిబింబిస్తోంది. నిందితుల్లో 322 మంది తెలంగాణ, విగతవారు ఇతర రాష్ట్రాల వాసులే అన్నారు. కమిషనరేట్ పరిధిలో 227 ఎన్డీపీఎస్ అనుమానిత షీట్లు తెరిచామన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రూ. 40.10 కోట్లు రీఫండ్ చేశామన్నారు. గణాంకాల ప్రకారం, 2024లో 28,626 కేసులు నమోదవ్వగా, 2025లో ఈ సంఖ్య 33,040కి పెరిగింది. రాచకొండ పరిధిలో 579 కిడ్నాప్, 1224 పోక్సో కేసులు నమోదు చేశామని సీపీ స్పష్టం చేశారు. దోపిడీ 3, చోరీలు 67, ఇళ్లలో చోరీ 589, వాహన చోరీలు 876, 73 హత్యలు, 330 హత్యాచారాలు, 12 వరకట్నం చావు, 782 గృహహింస కేసులున్నాయని వివరించారు. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాల సంఖ్య 4 శాతం పెరిగిందని సీపీ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించిన 17,760 కేసులు నమోదయ్యాయి. లై సెన్స్ రద్దు 5821, డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా రూ. 3.89 కోట్లు జరిమానా వచ్చిందన్నారు.