09-02-2026 12:07:07 AM
కేవీపీఎస్ మండల అధ్యక్షుడు గణపతి
నాగల్ గిద్ద, ఫిబ్రవరి 8: నాగల్ గిద్ద పోలీస్ స్టేషన్ లో ఏఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ కుమార్ గణతంత్ర దినో త్సవం నాడు ఉత్తమ ఏఎస్‌ఐ గా కలెక్టర్ చేతుల మీద అవార్డు, ప్రశంస పత్రాన్ని పొం దిన సందర్బంగా కెవిపిఎస్ మండల అధ్యక్షులు, వార్డు సభ్యుడు తుకారం కలిసి సన్మా నం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బడు గు బలహీనవర్గంలో పుట్టి కష్టపడి చదివి,
ఈస్థాయికి చేరుకున్న ఆయన ఇంకా ఎన్నో అవార్డులు పొందుతూ గొప్ప స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అలాగే పోలీస్ స్టేషన్ కు గుర్తింపు తెచ్చినందుకు వారికి తమ సం ఘం క్యాలెండర్ ఇచ్చి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అశోక్ ,శివ, లక్ష్మణ్ ,పుండ్లెక్ పాల్గొన్నారు.